హైదరాబాద్ : వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈనెల 5వ తేదీన హైకోర్టుకు సెలవు ఇచ్చారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ను మంగళవారం జారీ చేశారు. అలాగే ఈ నెల12వ తేదీ సెలవు దినాన్ని రద్దు చేస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు హైకోర్టుతో పాటు తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, హైదరాబాద్ మెడిటేషన్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్లకు వర్తిస్తాయని రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు.