అమ్మకానికి బండ్లగూడ, పోచారం రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు.. రేపటినుంచి దరఖాస్తులు
HMDA | హైదరాబాద్‌లో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునేవారికి హెచ్ఎండీఏ (HMDA)కల్పిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను (Rajiv swagruha flats) అమ్మకానికి పెట్టింది.
హైదరాబాద్: హైదరాబాద్‌లో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునేవారికి హెచ్ఎండీఏ (HMDA)కల్పిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను (Rajiv swagruha flats) అమ్మకానికి పెట్టింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిప్రకారం బండ్లగూడలో 419 ఫ్లాట్లు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయి. మరో 1082 ఫ్లాట్లలో పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పూర్తిగా సిద్ధమైన ఫ్లాట్ల ధరను చదరపు అడుగుకు రూ.3 వేలు, సెమీ ఫినిష్డ్ చదరపు అడుగుకి రూ.2,750గా నిర్ణయించింది.
ఇక పోచారంలో 1,328 ఫ్లాట్లు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాయి. మరో 142 ఫ్లాట్లలో స్వల్పంగా పనులు మిగిలి ఉన్నాయి. పూర్తయిన ఫ్లాట్ల ధరను చదరపు అడుగుకు రూ.2,500గా, సెమీ ఫినిష్డ్ చదరపు అడుగుకు రూ.2,250గా నిర్ణయించారు. గురువారం నుంచి జూన్ 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసక్తి కలిగినవారు మీ సేవ పోర్టల్, కంప్యూటర్ ఆధారిత లాటరీ ద్వారా ఫ్లాట్లను కేటాయిస్తారు. రేపట్నుంచి జూన్ 14 వరకు ఆన్ లైన్లో దరఖాస్తుకు అవకాశం ఉంది. మీ సేవ పోర్టల్, స్వగృహ వెబ్సైట్, మొబైల్యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత లాటరీ ద్వారా వచ్చే నెల 22న ఫ్లాట్లను కేటాయించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

