రూ.2141 కోట్లతో 8,621 కిలోమీటర్లు పూర్తి
త్వరలో పూర్తికానున్న 5 వేల కిలోమీటర్ల పనులు
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్త రహదారుల నిర్మాణంతోపాటు పాత రహదారుల పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ.4,118 కోట్లతో 13,740 కిలోమీటర్ల రహదారి పునరుద్ధరణ పనులను రోడ్లు భవనాలశాఖ చేపట్టింది. ఆర్ అండ్ బీశాఖ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది. ఇప్పటివరకు రూ.2,141 కోట్లు వెచ్చించి 8,621 కిలోమీటర్ల రహదారుల పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు.
మిగిలిన రూ.1,977 కోట్ల విలువైన 5,119 కిలోమీటర్ల రహదారుల పునరుద్ధరణ పనులు కూడా దాదాపు పూర్తి వచ్చాయి. గత ఏడాది దెబ్బతిన్న పలు రహదారుల పునరుద్ధరణకు మరో వేయి కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఆయా పనులు కూడా చేపడుతున్నారు. కొన్ని పనులకు ఎస్టిమేట్లు పూర్తి చేసి, కాంట్రాక్టర్ల ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టారు.