ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు : మంత్రి ఎర్రబెల్లి
ఆయిల్ ఫామ్ సాగు | ఆయిల్ ఫామ్ సాగు చేసిన ప్రతి రైతు 30 సంవత్సరాల వరకు తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందవచ్చన్నారు.

మహబూబాబాద్ : రైతులు లాభసాటి వ్యవసాయం చేసేందుకు నూతన పంటలు, పద్ధతులను అనుసరించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్లో రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తి దారుల సహకార సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తొర్రూరుకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ రావడం గర్వకారణమన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేసిన ప్రతి రైతు 30 సంవత్సరాల వరకు తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందవచ్చన్నారు. ఇతర సాగు పంటలకు ఎకరానికి వాడే నీరు ఆయిల్ ఫామ్ సాగుకు ఐదు ఎకరాల వరకు వాడవచ్చునని, కేంద్ర రాష్ట్ర లు మూడు సంవత్సరాల వరకు సబ్సిడీ ప్రభుత్వమే ఇస్తుందని పేర్కొన్నారు.
80 ఎకరాలు చెర్లపాలెం గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగుకు భూమిని కేటాయించామని, రైతుకు షెడ్ కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు. ఎకరానికి లక్షా ఇరవై వేల రూపాయలు బ్యాంకు నుంచి సబ్సిడీ పొందవచ్చన్నారు. లాభసాటి వ్యవసాయం చేసి, జిల్లా రైతాంగాన్ని ముందుకు తీసుకుపోవాలని మంత్రి సూచించారు.ఎలాంటి నేల కైనా ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటుందన్నారు.150 కోట్ల వ్యయంతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణాలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.
రైతులందరూ సమిష్టిగా ఆయిల్ ఫామ్ సాగుకు శ్రీకారం చుట్టి లాభాలు గడించాలన్నారు.
హరిపిరాల లో నర్సరీని ప్రభుత్వమే నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ ఆయిల్ ఫామ్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, ఎం.వి.ప్రసాద్ శాస్త్రవేత్త సుధీర్ రెడ్డి, జనరల్ మేనేజర్, డిహెచ్ఎస్ఓ సూర్యనారాయణ, డీఏవో చత్రు నాయక్, సత్యనారాయణ మేనేజర్, రైతుబంధు కోఆర్డినేటర్ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
‘రైతు బీమా’ దరఖాస్తునకు చివరి తేదీ ఆగస్టు 11
Tokyo Olympics: మెడల్పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి
Nanajipur waterfalls : హైదరాబాద్కు చేరువలో అద్భుతమైన జలపాతం
Lionel Messi: సంచలనం.. బార్సిలోనా నుంచి మెస్సీ ఔట్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

