గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి హైకోర్టు అనుమతి
TSPSC | గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదంపై టీఎస్పీఎస్సీ అప్పీలుపై హైకోర్టు విచారణ జరిపింది. అభ్యర్థి స్థానికత వివాదంపై కౌంటర్ దాఖాలు
హైదరాబాద్ : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదంపై టీఎస్పీఎస్సీ అప్పీలుపై హైకోర్టు విచారణ జరిపింది. అభ్యర్థి స్థానికత వివాదంపై కౌంటర్ దాఖాలు చేయాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతానికి గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు విడుదల చేసుకోవచ్చని కోర్టు సూచించింది. అభ్యర్థి స్థానికత వివాదం తర్వాత తేలుస్తామని కోర్టు స్పష్టం చేసింది.
మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,85,916 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అక్టోబర్ 29న ప్రాథమిక కీని విడుదల చేసి, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది టీఎస్పీఎస్సీ. అభ్యర్థుల నుంచి వ్యక్తమైన సందేహాలపై సబ్జెక్ట్ నిపుణుల కమిటీ సిఫార్సులు పరిశీలించి, 5 ప్రశ్నలను తొలగించారు. అనంతరం నవంబర్ 15వ తేదీన తుది కీని ప్రకటించారు. మాస్టర్ ప్రశ్నాపత్రం ప్రకారం 29, 48, 69, 82, 138 ప్రశ్నలను తొలగించింది. ఒక్కో ఉద్యోగానికి 50 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. అంటే మొత్తం 25,150 మంది గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

