హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): వ్యూహం సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్‌లోని అంశాలను మరోసారి పరిశీలించి తగు ఉత్తర్వులు జారీ చేయాలని సింగిల్ బెంచ్ జడ్జిని బుధవారం హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది.
ముందుగా నిర్ణయించిన తేదీ (ఈ నెల 11)కి బదులు ఈ నెల 8న వ్యాజ్యాన్ని విచారించాలని తెలిపింది. ఆలోగా సినిమా విడుదలకు సర్టిఫికెట్ జారీ రికార్డులను సమర్పించాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది.