దర్శకుడు రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, బంజారాహిల్స్ సమీపంలోని షేక్‌పేట్‌లో అత్యంత విలువైన రెండెకరాల భూకేటాయింపుల్లో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణపై సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు, మరికొందరికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.
- భూ దుర్వినియోగంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం
హైదరాబాద్, నవంబర్ 9, (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, బంజారాహిల్స్ సమీపంలోని షేక్‌పేట్‌లో అత్యంత విలువైన రెండెకరాల భూకేటాయింపుల్లో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణపై సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు, మరికొందరికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. బంజారాహిల్స్ సర్వే నం.403/1లోని రెండెకరాల భూ కేటాయింపును రద్దు చేయాలంటూ మెదక్‌కు చెందిన బాలకిషన్ 2012లో దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం గురువారం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది.
గత ఏడాది రాఘవేంద్రరావు, ఆయన బంధువులు కే కృష్ణమోహన్‌రావు, కేఎస్ చక్రవర్తి, కే విజయలక్ష్మి, కే అఖిలాండేశ్వరి, కే లాలసదేవికి నోటీసులు జారీ అయ్యాయి. వాటిని అందుకున్నట్టుగా రికార్డుల్లో లేకపోవడంతో వారికి మళ్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్‌కు సినీ పరిశ్రమను తరలించాలని 1984లో అప్పటి ప్రభుత్వం రెండెకరాలను రాయితీ ధరకు ఇస్తే దానిలో నిబంధనలకు విరుద్ధంగా రాఘవేంద్రరావు, ఆయన బంధువులు పబ్స్, బార్స్, థియేటర్స్ నిర్మించారని పిటిషనర్ ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 18కి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

