హైదరాబాద్ : గతంలో లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్(Suspension) అయిన హకీంపేట స్పోర్ట్స్ స్కూల్(Sports School) మాజీ ఓఎస్డీ హరికృష్ణ సస్పెన్షన్ ఎత్తివేయాలని హైకోర్టు(High Court) ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా తనని సస్పెండ్ చేశారని హరికృష్ణ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించిన హైకోర్టు పై విధంగా తీర్పునిచ్చింది.
ఈ సందర్భంగా హరికృష్ణ(Harikrishna) మాట్లాడుతూ.. నిరాధార ఆరోపణలతో నన్ను సస్పెండ్ చేశారని, నన్ను నా కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు.