యశోదలో బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సకు ల్యాబ్

- బై ప్లేస్ న్యూరో క్యాథ్ ల్యాబ్‌ను ప్రారంభించిన గవర్నర్ తమిళిసై
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): బ్రెయిన్ స్ట్రోక్ చికిత్స కోసం రాష్ట్రంలో తొలిసారిగా అత్యాధునిక బై ప్లేస్ న్యూరో-క్యాథ్ ల్యాబ్‌ను సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ అందుబాటులోకి తెచ్చింది. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా శుక్రవారం ఈ ల్యాబ్‌ను గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రారంభించారు. 50 ఏండ్లు దాటినవారికి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉన్నందున ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని ఆమె సూచించారు. డైరెక్ట్ టు ఆంజియో సూట్ (డీటీఏఎస్) టెక్నాలజీతో పనిచేసే బై ప్లేస్ న్యూరో ఆంజియో ప్రొసీజర్ సూట్ అనే ప్రపంచస్థాయి అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తేవడం రాష్ర్టానికే గర్వకారణమని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ పవన్ గోరుకంటి చెప్పారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినవారిని ఎంత వేగంగా స్ట్రోక్ సెంటర్‌కు తీసుకొచ్చి ఎంత త్వరగా చికిత్స అందిస్తే అంతే మంచి ఫలితం ఉంటుందని ఆ హాస్పిటల్స్ సీనియర్ న్యూరో, ఇంటర్వెన్షనల్ రేడియోలాజిస్ట్ సురేశ్ గిరిగాని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం, సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కోమల్‌కుమార్, పలువురు న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్లు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

