హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. ఈ మేరకు ఆదివారం ఆయా జిల్లాలకు ప్రాథమిక హెచ్చరికలు జారీచేసింది. ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్గఢ్లో ఏర్పడిన ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించినట్టు తెలిపింది. దీని ప్రభావం వల్ల ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు నారాయణపేట, మహబూబ్నగర్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించింది.
సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపలల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.