ఈ వారం మస్తు వానలు
ఈ నెల 3,4 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడుతాయని వెల్లడించింది. దక్షిణ తెలంగాణలో వర్షాలు తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురువలేదు
- 3, 4 తేదీల్లో పలుచోట్ల భారీ వర్షాలు
- నేడు, రేపు తేలికపాటి జల్లులకు అవకాశం
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఈ నెల 3,4 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడుతాయని వెల్లడించింది. దక్షిణ తెలంగాణలో వర్షాలు తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురువలేదు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లో అత్యంత తక్కువ వర్షం కురిసింది. ఇదే సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రోజూ ఏదో ఒక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రతి రోజు వర్షం కురుస్తున్నది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆదివారం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లో కూడా ఆదివారం సాయంత్రం అనేకచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. ఉత్తర, దక్షిణ ద్రోణి ఆదివారం దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా స్థిరంగా కొనసాగుతున్నది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

