తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వానలు.. ఎల్లో అలర్ట్ జారీ
ts weather update |
హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల మూడురోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పలుజిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. 14న మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
15న వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు వివరించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఈ మేరకు.. మూడు రోజులు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఇవాళ్టి ఉదయం వరకు సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్‌నగర్‌తో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాపాతం నమోదైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

