వరంగల్ : వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. జిల్లాలో జీవో 97 రద్దు చేయాలని నిరసనలు తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు మాజీ మంత్రి హరీశ్ రావు వస్తున్న నేపథ్యంలో వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కళాశాలకు వచ్చే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు.
4, 5 కంటే ఎక్కువగా కలిసి వచ్చే విద్యార్థులను అడ్డుకుంటున్నారు. అలాగే వరంగల్, హనుమకొండలో విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు. ఇప్పటికే ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలకు వచ్చిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డిని అడ్డుకుని అక్కడి నుంచి పంపించారు.