అవును.. ఆ ‘గుండెలు’ పరిగెడతాయి!
ఆధునిక జీవన శైలిలో గుండె సంబంధిత సమస్యలు అధికమవుతున్నాయి. హైపర్ టెన్షన్, డయాబెటిస్ వంటి జీవనశైలి వ్యాధుల కారణంగా గుండె సంబంధ సమస్యలు పెరిగిపోతున్నాయి.
- దేశంలోనే మొట్టమొదటి ‘కార్డియాక్ రీహ్యాబ్’
- వ్యాయామాలతో తగ్గుతున్న గుండె మార్పిడి అవసరం
- సత్ఫలితమిస్తున్న డాక్టర్ మురళీధర్ బాబి ప్రయోగం
అమీర్‌పేట్, నవంబర్ 18: ఆధునిక జీవన శైలిలో గుండె సంబంధిత సమస్యలు అధికమవుతున్నాయి. హైపర్ టెన్షన్, డయాబెటిస్ వంటి జీవనశైలి వ్యాధుల కారణంగా గుండె సంబంధ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఒక్కసారి గుండె సమస్యల బారిన పడితే ఎలాంటి బరువు పనులు చేయలేము. కొన్ని సమయాల్లో గుండె మార్పిడి శస్త్రచికిత్సలు తప్పనిసరి అవుతాయి. అయితే, గుండె సమస్యలున్నా కొద్దిపాటి వ్యాయామాలతో గుండె పూర్వ బలాన్ని సంతరించుకునేలా చేస్తున్నారు హైదరాబాద్ సనత్‌నగర్ ఈఎస్ఐసీ వైద్య కళాశాలలోని ‘కార్డియాక్ రీహ్యాబ్’ వైద్యుడు డాక్టర్ మురళీధర్ బాబి. కొన్నేండ్లుగా హృద్రోగులపై ఆయన చేసిన ప్రయోగాలు సత్ఫలితాలిచ్చాయి. దేశంలోనే మొట్టమొదటిదైన కార్డియాక్ రీహ్యాబ్ విధానం పట్ల ఇప్పుడిప్పుడే హృద్రోగుల్లో అవగాహన పెరుగుతున్నది. కార్డియాక్ రీహ్యాబ్ వ్యాయామ చికిత్స పొందిన పలువురు 3 కే, 5 కే, 10 కే మారథాన్‌లో పాల్గొంటుండటం విశేషం.
2021లో కార్డియాక్ రీహ్యాబ్ ఏర్పాటు
ఈఎస్ఐసీ వైద్య కళాశాల పూర్వ డీన్ డాక్టర్ శ్రీనివాస్‌రావు సహకారంతో 2021 నవంబర్‌లో డాక్టర్ మురళీధర్ బాబి ఆధ్వర్యంలో ‘కార్డియాక్ రీహ్యాబ్’ ఏర్పడింది. వివిధ కారణాలతో బలహీనపడ్డ గుండె కండరాలకు బలాన్ని ఇచ్చే వ్యాయామాలను సుశిక్షితులైన ఆరుగురు ఫిజియోథెరపిస్టులు, ఒక టీఎంటీ పర్యవేక్షణలో హృద్రోగులతో చేయిస్తారు. దాదాపు 3 నుంచి 6 నెలలపాటు చేయాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కేం ద్రం పని చేస్తుంది. వ్యాయామం చేసే వారికి హార్ట్ సెన్సర్లను అమర్చడం ద్వారా.. వారి గుం డె కదలికలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లలో పరిశీలిస్తారు. సమస్యలను బట్టి ట్రెడ్మిల్, ఆర్మ్ ఎర్గోమీటర్, సైకిల్ ఎర్గోమీటర్లతో వీరికి వ్యాయామాలు ఉంటాయి. ఇక్కడ వ్యాయామాలు పూర్తవుతున్న దశలోనే తమ గుండె పనితీరుపై నమ్మకం పెరుగుతుండటంతో పలువురు హృద్రోగులు 3 కే, 5 కే, 10 కే, 21 కే మారథాన్లలో పాల్గొంటుండటం విశేషం.
గుండె మార్పిడి అవసరం లేకుండా..
గుండె సంబంధ వ్యాధులతో పల్మనరీ ఆర్టిరియల్ హైపర్‌టెన్షన్ (పీఏహెచ్), డైలేటెడ్ కార్డియోమయోపతి (డీసీఎం), హార్ట్ ఫెయిల్యూర్(హెచ్ఎఫ్) బారినపడ్డ వారికి తాత్కాలిక ఉపశమనం కలిగించేలా శస్త్రచికిత్సలు చేసినా.. కొందరికి గుండె మార్పిడి శస్త్రచికిత్స తప్పనిసరి అవుతుంది. ఇలాంటి ఎంతోమంది కార్డియాక్ రీహ్యాబ్‌లో చేరి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటున్నారు.
10 కే మారథాన్‌లో పాల్గొన్నా..
కొన్ని నెలల క్రితం నేను పల్మనరీ ఆర్టిరియల్ హైపర్‌టెన్షన్ (పీఏహెచ్) బారిన పడ్డా. వైద్యులు గుండె మా ర్పిడి తప్పదని చెప్పా రు. ఈఎస్ఐసీలోని కార్డియాక్ రీహ్యాబ్ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. 4 నెలల నుంచి ఇక్కడ వ్యాయామాలు చేస్తున్నా. ప్రస్తుతం గుండె మార్పిడి అవసరం లేకుండానే ఆరోగ్యంతో ఉన్నా. నేను 5 కే, 10 కే మారథాన్లలో కూడా పాల్గొంటున్నా.
– శ్రీధర్, హైదరాబాద్
మూడుసార్లు 21 కే మారథాన్‌లో..
ఏడాది క్రితం నాకు హార్ట్ ఫెయిలైంది. తక్షణ వైద్యంతో బయటపడ్డాను. 6 నెలల క్రితం వైద్యుల సలహా మేరకు కార్డియాక్ రీహ్యాబ్‌లో చేరాను. కార్డియో వాస్క్యులర్ వ్యాయామాలు చేస్తున్నాను. క్రమంగా గుండె పంపింగ్ స్థాయి 18 నుంచి 54కు చేరింది. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. ఆరు నెలల కాలంలో 21 కే మారథాన్‌లో మూడుసార్లు పాల్గొన్నాను.
– లింగం, జగద్గిరిగుట్ట
అపోహలను వదిలిపెట్టాలి
గుండె వ్యాధుల బారినపడితే ఇక అంతే సంగతులన్న అపోహల నుంచి ముందు బయటపడాలి. పాడైన గుండె కండరాలు సులభ వ్యాయామాలతో తిరిగి బలం పుంజుకుంటాయి. కొన్నేండ్లుగా హృద్రోగులపై నేను చేసిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. కార్డియాక్ రీహ్యాబ్ ద్వారా ఇప్పటివరకు 35 మంది ఆరోగ్యంగా బయటికి వెళ్లారు. నిత్యం ఇక్కడ కనీసం 15 మందికి వ్యాయామ చికిత్సలు జరుగుతాయి. మూడు దశల్లో వ్యాయామం చేయిస్తాం. గుండెను కొద్ది నెలల్లో తిరిగి బాగు చేసుకోగలమనే నమ్మకం వారిలో కలిగించగలుగుతున్నాం. కార్డియాక్ రీహ్యాబ్‌లో చేరిన పలువురు 3 కే, 5 కే, 10 కే, 21 కే మారథాన్లలో విజయవంతంగా పాల్గొనడం సంతోషంగా ఉన్నది.
– డాక్టర్ మురళీధర్ బాబి, కార్డియాక్ రీహ్యాబ్ స్పెషలిస్ట్, ఈఎస్ఐసీ వైద్య కళాశాల, సనత్‌నగర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
Sanjay Gupta | బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
Tharun Bhascker | కొత్త మిషన్‌తో తిరిగొచ్చారు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

