నిమ్స్‌లో అగ్గువకే హెల్త్చెకప్
మాస్టర్ హెల్త్ చెకప్..! కార్పొరేట్ దవాఖానలకే పరిమితమైన ఈ సదుపాయం ప్రస్తుతం ప్రభుత్వ రంగంలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో కూడా అందుబాటులోకి వచ్చింది.
- అందుబాటులో 12 రకాల ప్యాకేజీలు
- 100కు పైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు
- మల్టిపుల్ కన్సల్టెన్సీ సదుపాయం
- ఆరు నెలల్లో 270 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లకు వైద్య పరీక్షలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ): మాస్టర్ హెల్త్ చెకప్..! కార్పొరేట్ దవాఖానలకే పరిమితమైన ఈ సదుపాయం ప్రస్తుతం ప్రభుత్వ రంగంలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో కూడా అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా 40 ఏండ్లు దాటిన వారు ఏడాదికి ఒకసారైనా వైద్యపరీక్షలు చేయించుకొంటే, రాబోయే వ్యాధులను ముందుగానే గుర్తించి జాగ్రత్త పడవచ్చునని, ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చునని వైద్యులు చెప్తుంటారు. ఈ వైద్య పరీక్షలను మాస్టర్ హెల్త్ చెకప్ అంటారు. కరోనా నేపథ్యంలో వీటికి డిమాండ్ పెరిగింది. కార్పొరేట్ దవాఖానల కంటే తక్కువ ధరలకే నిమ్స్‌లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్‌లో 2019లోనే ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లో 12 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మాస్టర్ హెల్త్ చెకప్‌తో పాటు ఆయా వ్యాధులు, ప్రధాన అవయవాలకు సంబంధించిన వైద్య పరీక్షలను సంబంధిత వైద్యుల కన్సల్టేషన్ సిఫారసు మేరకు నిర్వహిస్తున్నట్టు నిమ్స్ వెల్నెస్ సెంటర్ ఇన్చార్జి అనుగంటి సత్యాగౌడ్ వివరించారు. దీంతో హెల్త్చెకప్ చేయించుకొనేవారికి అన్ని సేవలు ఒకేచోట లభించడంతో పాటు సమయం ఆదా అవుతున్నది. మాస్టర్ హెల్త్ చెకప్‌లో భాగంగా 12 రకాల వైద్య పరీక్షలతో పాటు రూ.15 వేలతో పురుషులకు, రూ.16 వేలతో మహిళలకు హోల్బాడీ చెకప్ కూడా నిర్వహిస్తున్నారు. హెల్త్ చెకప్‌కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వస్తున్నట్టు సత్యాగౌడ్ తెలిపారు.
రెండు నుంచి మూడు గంటల్లో అన్ని పరీక్షలు
నిమ్స్‌లోని ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ సేవలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. హెల్త్చెకప్లన్నీ రెండు, మూడు గంటల్లోనే పూర్తవుతాయి. సింగిల్ విండో ద్వారా అన్నీ పరీక్షలు ఒకేచోట నిర్వహిస్తున్నాం. ముందుగా అపాయింట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరంగానీ, నిరీక్షించాల్సిన అవసరంగానీ ఉండదు. మాస్టర్ హెల్త్ చెకప్, ఇతర హెల్త్ చెకప్‌లు చేయించుకొన్నవారికి ఆయా వైద్యులతో కన్సల్టేషన్ కూడా ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్‌లు, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. వైద్య పరీక్షల తరువాత రోగులు ఇన్స్యూరెన్స్ కార్డులు, ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా నిమ్స్‌లోని అన్ని విభాగాల్లో చికిత్స పొందవచ్చు. – అనుగంటి సత్యాగౌడ్, వెల్నెస్ సెంటర్ ఇన్చార్జి

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- health checkup
- NIMS
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

