రామచంద్రాపురం, మార్చి 4: దేశంలో సోలార్ విద్యుత్తు ఉత్పత్తిలో అత్యుత్తమ సహకారం అందిస్తున్న భెల్ సంస్థకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ 2022 అవార్డు దక్కిందని భెల్ ఈడీ వరదరాజన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కేసింగ్ చేతుల మీదుగా భెల్ సంస్థ సీఎండీ నళిన్ సింఘాల్ ఈ అవార్డు అందుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.
భెల్ భారీ విద్యుత్తు ఉత్పత్తి పరికరాల తయారీతోపాటు సోలార్ విద్యుత్తు ఉత్పత్తిలో అత్యుత్తమ సహకారం అందిస్తున్నందుకు కేంద్ర మంత్రి ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు. భెల్‌కు సీబీఐపీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉన్నదని, ఇది కార్మికుల విజయంగా ఆయన అభివర్ణించారు.