కాళేశ్వరం కూలితే కాల్వల్లో పారే నీళ్లెక్కడివి?
కాళేశ్వరం నుంచి వచ్చే పారే గోదావరి జలాలు ప్రజల కండ్ల కు కనిపిస్తున్నా, సీఎం రేవంత్‌రెడ్డి కండ్లకు మాత్రం కనిపించడం లేదా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. గురువారం సిద్దిపేటలో క్యాంప్ కార్యాలయంలో తన ఓటరు ఎన్యుమరేషన్ పత్రా న్ని స్వయంగా నింపి బీఎల్వోకు అందజేశారు.
- గోదావరి జలాలు ప్రజల కండ్లముందున్నా రేవంత్‌రెడ్డి కండ్లకు మాత్రం కనిపిస్తలేదా?
- మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
సిద్దిపేట, జూలై 9 : కాళేశ్వరం నుంచి వచ్చే పారే గోదావరి జలాలు ప్రజల కండ్ల కు కనిపిస్తున్నా, సీఎం రేవంత్‌రెడ్డి కండ్లకు మాత్రం కనిపించడం లేదా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. గురువారం సిద్దిపేటలో క్యాంప్ కార్యాలయంలో తన ఓటరు ఎన్యుమరేషన్ పత్రా న్ని స్వయంగా నింపి బీఎల్వోకు అందజేశారు. ప్రతి ఒకరూ బాధ్యతగా తమ ఓటరు ఎన్యుమరేషన్ పత్రాన్ని నింపి, ఈ నెల 24లోగా సంబంధిత అధికారులకు అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం చిన్నకోడూర్ మండల పర్యటనలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం జలాలు సిద్దిపేటకు రావడం వల్లే 6లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని, ధాన్యం నిల్వ చేయడానికి గోదాములు నిండిపోయి, తరలించేందుకు కనీ సం లారీలు కూడా దొరుకని పరిస్థితి వ చ్చిందని పేర్కొన్నారు.
నిత్యం కాలువలు, కెనాళ్ల ద్వారా ప్రజలకు సాగు, తాగునీరు అందుతుంటే రేవంత్‌రెడ్డి మాత్రం కాళేశ్వరం కూలిపోయిందని తప్పుడు ప్రచా రం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డిని పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సిన ఆవసరం ఉన్నదని చెప్పారు. గురుకులాల్లో కోడిగుడ్లతో మొదలుకొని విద్యార్థులు వేసుకొనే బూట్లు, యూనిఫామ్‌లు ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతిదాంట్లో కమిషన్లేనని ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. మకజొన్న రైతుకు కనీసం నాలుగు బస్తాలు ఇవ్వాలని కానీ ప్రభుత్వం రెండు బస్తాలే ఇస్తామని సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల ఎరువుల ధరలు విపరీతంగా పెంచడం వల్ల రైతులకు పెనుభారమైందని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే యాప్ రద్దు చేయాలని, యూరియాపై సీలింగ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

