జలాశయాలు నింపి రైతులకు నీరివ్వండి
సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ(అనంతగిరి) రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాల్లోని కాళేశ్వరం గోదావరి జలాలు పంపింగ్ చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ రాశారు.
- రాజకీయాలు పక్కనపెట్టి నీటిని పంపింగ్చేయండి
- మంత్రి ఉత్తమ్‌కు హరీశ్‌రావు లేఖ
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) / సిద్దిపేటప్రతినిధి: సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ(అనంతగిరి) రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాల్లోని కాళేశ్వరం గోదావరి జలాలు పంపింగ్ చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్లు డెడ్‌స్టోరేజీకి చేరినట్టు తెలిపారు.
గతేడాది ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్‌లో 3.32 టీఎంసీలు నీళ్లు ఉంటే, ప్రస్తుతం 0.75 టీఎంసీలు, రంగనాయకసాగర్‌లో 2.38 టీఎంసీలకు ప్రస్తుతం 0.67 టీఎంసీలు, మల్లన్నసాగర్ 18 టీఎంసీలకు ప్రస్తుతం 8.5 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్‌లో 10 టీఎంసీలకు ప్రస్తుతం 4.5 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, పంటలు వేయాలా? వద్దా?అనే అయోమయంతో ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.
గతేడాదితో పోలిస్తే జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోయిందని చెప్పారు. రాజకీయాలు పక్కనపెట్టి మిడ్ మానేరు అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రిజర్వాయర్లు నింపి కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని రైతుల పక్షాన మంత్రిని హరీశ్‌రావు లేఖలో కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

