మృతదేహాల కోసం 18 గంటలా?
సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనలో బాధిత కుటుంబసభ్యులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. మృతదేహాల కోసం వారి కుటుంబీకులు 18 గంటలపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.
- ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
- మృతుల కుటుంబాలకు 50 లక్షలు, క్షతగాత్రులకు 25 లక్షలు ఇవ్వాలి
- యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టాలి
- బాధిత కుటుంబాలకు హరీశ్‌రావు ఓదార్పు
- మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు అధికారుల ఏర్పాట్లు
సంగారెడ్డి, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనలో బాధిత కుటుంబసభ్యులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. మృతదేహాల కోసం వారి కుటుంబీకులు 18 గంటలపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రమాదంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పరిశ్రమ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు, క్షతగాత్రులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. మృతుల కుటుంబాలకు, క్షతగ్రాతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గురువారం హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, చింతా ప్రభాకర్, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి ఎస్బీ ఆర్గానిక్స్ కంపెనీని సందర్శించారు. సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని ఎంఎన్ఆర్ దవాఖానలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించారు. హరీశ్‌రావు ఎస్బీ ఆర్గానిక్స్ కంపెనీకి చేరుకోగానే ప్రమాద బాధితుల కుటుంబసభ్యులు ఆయన వద్దకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం, పరిశ్రమ యాజమాన్యం తమను పట్టించుకోవడంలేదని, న్యాయం చేయాలని కోరితే పోలీసుల లాఠీలతో కొట్టి చెదరగొట్టారని చెప్పారు. మృతులు దయానంద్ భార్య మటిల్డా, సురేశ్‌పాల్ భార్య రాంబతి మాట్లాడుతూ.. తమ భర్తలు చనిపోయినట్టు కంపెనీ యాజమాన్యం కనీసం సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
కలెక్టర్‌కు హరీశ్‌రావు ఫోన్
ఘటనా స్థలం వద్ద నుంచే హరీశ్‌రావు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతితో ఫోన్లో మాట్లాడారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, మృతుల కుటుంబీకులను, క్షతగాత్రులను గాలికి వదిలేశారని అసంతృప్తి వ్యక్తంచేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు అప్పగించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని, ఆయా దవాఖానల్లో సైతం ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కోరారు. హరీశ్‌రావు పరిశ్రమను సందర్శించిన తరువాత అధికారుల్లో కదలిక వచ్చింది. ఐజీ సుధీర్‌బాబు, ఎస్పీ రూపేష్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కంపెనీ యాజమాన్యంపై పోలీసు కేసు నమోదుచేశారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేయించి మృతదేహాలను కుటుంబీలకు అప్పగించారు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లుచేశారు. హరీశ్‌రావు సూచన మేరకు బీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు శివశంకర్ తదితరులు బాధిత కుటుంబాలకు అండగా నిలిచి అవసరమైన సహాయం అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

