Harish Rao | ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: హరీశ్ రావు
ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం విఫలమయ్యాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. జిల్లాలో వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
సంగారెడ్డి: ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం విఫలమయ్యాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. జిల్లాలో వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాదంలో గాయపడి ఎంఎన్ఆర్ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను హరీశ్ రావు పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రమాద ఘటన దురదృష్టకరమన్నారు. ప్రమాదంలో గాయపడినవారిని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చికిత్స పొందుతున్న వాళ్లు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. క్షతగాత్రులకు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించలేదని విమర్శించారు.
గాయపడినవారు ఎంత మంది ఉన్నారో కంపెనీ యాజమాన్యం చెప్పడం లేదన్నారు. కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. గాయపడినవారికి రూ.25 లక్షల చొప్పున సహాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదని వెల్లడించారు. మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పారు. ప్రమాద ఘటనకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలన్నారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున సహాయం చేస్తామన్నారు. కాగా, కంపెనీలో బాయిలర్ పేలి ఆరుగురు మృతిచెందడం బాధాకరమని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

Harishrao 1
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

