‘మున్సిపల్’ జీతాలు పెంచేదెప్పుడు.. మూడేండ్లుగా నయాపైసా పెంచని కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లయినా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు జీతాలు పెంచకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నా వారి జీతాలు మాత్రం పెరుగక ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లులు, రవాణా ఖర్చులతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
- పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి
- కేసీఆర్ హయాంలో రూ.8వేల నుంచి 16,600 చేశాం
- ఇతర విభాగాలకూ గ్రూప్ విధానం అమలుచేయాలి
- కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తా
- బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు స్పష్టం
- సిద్దిపేట కార్మికులతో కలిసి అల్పాహారం, ఆత్మీయ పలుకరింపు
- దసరా పండుగ సందర్భంగా చీరలు, డ్రెస్‌లు అందజేసి శుభాకాంక్షలు
సిద్దిపేట, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లయినా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు జీతాలు పెంచకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నా వారి జీతాలు మాత్రం పెరుగక ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లులు, రవాణా ఖర్చులతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తక్షణమే కార్మికుల జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా ఇతర మున్సిపల్ విభాగాల కార్మికులకూ గ్రూపు విధానాన్ని వర్తింపజేయాలని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తానని స్పష్టంచేశారు. దసరా పండుగను పురసరించుకొని సోమవారం సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులతో హరీశ్‌రావు ఆత్మీయంగా ముచ్చటించారు. వారితో కలిసి టిఫిన్ చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తన సొంత ఖర్చులతో మహిళా కార్మికులకు చీరలు, పురుషులకు ప్యాంట్లు, షర్టులు అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు చేస్తున్న సేవకు తన వంతుగా గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్ట వివరించారు. పట్టణం పరిశుభ్రంగా కనిపించడం వెనుక వారి కష్టం, త్యాగం, నిరంతర శ్రమ దాగి ఉన్నాయని చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ కష్టాలే
కాంగ్రెస్ పాలనలో కార్మికులకు ఎప్పుడూ కష్టాలేనని హరీశ్‌రావు విమర్శించారు. నాటి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో పారిశుద్ధ్య కార్మికులకు మూడు, ఐదు, ఆరు నెలలపాటు జీతాలు అందని పరిస్థితులు ఉండేవని దుయ్యబట్టారు. వేతనాల కోసం కార్మికులు ఎర్రజెండాలు పట్టుకొని ఆర్డీవో కార్యాలయాలు, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాల్సి వచ్చేదని ఆయన గుర్తుచేశారు. అప్పట్లో ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనం రూ.8,300 మాత్రమే ఉండేదని, కాంట్రాక్టర్ల ప్రమేయంతో జీతాలు సకాలంలో అందడంలోనూ ఇబ్బందులు ఎదురయ్యేవని పేరొన్నారు.
అసెంబ్లీలో కార్మికుల గొంతుకగా నిలుస్తాం
పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు, ఇతర మున్సిపల్ విభాగాలకు గ్రూపు విధానం విస్తరణ, ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించిన పెండింగ్ సమస్యల పరిషారం వంటి అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీశ్‌రావు తేల్చిచెప్పారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా నెరవేర్చాలని హితవు పలికారు. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచే కార్మికుల జీవితాల్లోనూ వెలుగులు నిండినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, వారి శ్రమకు తగిన ప్రతిఫలం అందే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టంచేశారు.
కేసీఆర్ పాలనలో దశలవారీగా పెంపు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల వేతనాలను దశలవారీగా పెంచిందని హరీశ్‌రావు తెలిపారు.రూ.8,300 నుంచి రూ.16,600 వరకు పెంచడమే గాక కాంట్రాక్టర్లు, మధ్యవర్తుల ప్రమేయాన్ని తొలగించి ఏడుగురు కార్మికులతో ఒక గ్రూప్ ఏర్పాటుచేసి, ప్రభుత్వమే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమచేసే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఫలితంగా వేతనాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి తగ్గిందని పేరొన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల వేతనాలను పెంచలేదని ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు పెంచాలని కోరడంలో తప్పేమీ లేదని, వారి డిమాండ్ న్యాయమై నదని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు ఇండ్లకే పరిమితమైనప్పటికీ వారు మాత్రం ప్రాణాలు పణంగా పెట్టి వీధులను శుభ్రం చేశారని హరీశ్‌రావు కొనియాడారు. ఆ సమయంలో తాను మంత్రిగా ఉండి కార్మికుల వెంట తిరిగి భరోసా కల్పించానని, అవసరమైన కిట్లు ఇచ్చినట్టు వివరించారు. సంక్షోభ సమయాల్లో ముందుండి సేవలందించే కార్మికులకు తగిన వేతనం, గౌరవం, ఉద్యోగ భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించే విధానాన్ని ఇతర విభాగాలకూ విస్తరించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

