విస్తృత అధ్యయనశీలి చాడ
విస్తృత అధ్యయనం, ముక్కుసూటిగా మాట్లాడే నైజం సీపీఐ సీనియర్ నేత చాడ వెంకట్‌రెడ్డి సొంతమని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. చాడ వెంకట్‌రెడ్డి శాసనసభలో చేసిన ప్రసంగాలతో రూపొందించిన ‘అసెంబ్లీ సాక్షిగా నా పోరాటం’ పుస్తకాన్ని బుధవారం అసెంబ్లీ కమిటీహాల్లో ఆవిష్కరించారు.
- ఉద్యమాల్లో కలిసి పాల్గొన్నాం
- ‘అసెంబ్లీ సాక్షిగా నా పోరాటం’ పుస్తకావిష్కరణలో హరీశ్‌రావు
- చాడా ప్రసంగాలు ఆసక్తిగా వినేవాణ్ణి: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): విస్తృత అధ్యయనం, ముక్కుసూటిగా మాట్లాడే నైజం సీపీఐ సీనియర్ నేత చాడ వెంకట్‌రెడ్డి సొంతమని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. చాడ వెంకట్‌రెడ్డి శాసనసభలో చేసిన ప్రసంగాలతో రూపొందించిన ‘అసెంబ్లీ సాక్షిగా నా పోరాటం’ పుస్తకాన్ని బుధవారం అసెంబ్లీ కమిటీహాల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఈ పుస్తకం కొత్తగా సభకు వచ్చే సభ్యులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. 610 జీవోపై నిర్వహించిన శాసనసభపక్ష సమావేశానికి తాను, చాడ వెంకట్‌రెడ్డి గంట ముందుగానే వెళ్లి ప్రిపేర్ అయ్యామని గుర్తు చేసుకొన్నారు. తాను ‘తెలంగాణకు అడ్డం కాదు.. పొడుగు కాదు’ అని వైఎస్ అంటే.. చాడ వెంటనే లేచి ‘..కానీ వంకర ఉన్నావు’ అని వ్యంగ్యంగా సమాధానం చెప్పారని గుర్తుచేశారు. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ముక్కుసూటిగా మాట్లాడే చాడ వెంకట్‌రెడ్డి ప్రసంగాలను ఆసక్తిగా వినేవాడినని చెప్పారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకే కేసీఆర్‌తో కలిసి పోరాటం: తమ్మినేని వీరభద్రం
దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడేందుకు సీఎం కేసీఆర్‌తో కలిసి పోరాటం చేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. దేశంలో ఎక్కడా చట్టసభలు ఉండకూడదనే కుట్ర సాగుతున్నదని, దీనిని కలిసికట్టుగా తిప్పికొట్టాలని సూచించారు. పుస్తక రచయిత చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న 2004-09 ఉద్యమాలకు గోల్డెన్ పీరియడ్ అని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తామని చెప్పారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పార్టీ సీనియర్ నేత పల్లా వెంకట్‌రెడ్డి, ఐజేయూ జాతీయ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు కే శ్రీనివాస్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
సభా విలువలు కాపాడిన చాడ: పోచారం
శాసనసభ విలువలను కాపాడిన వ్యక్తి చాడా వెంకట్‌రెడ్డి అని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కొనియాడారు. తాను మొదటిసారి సభకు వచ్చినపుడు సీనియర్ల ప్రసంగాలను వినేవాడినని, కమ్యూనిస్టు సభ్యులు విలువలతో కూడిన అంశాలపై మాట్లాడేవారని గుర్తుచేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కమ్యూనిస్టు నాయకుల్లో తనకు బాగా ఆత్మీయత ఉన్న నేత రాఘవరెడ్డి అని, ఆయన ప్రసంగాలు కూడా ప్రచురితం కావాలని ఆకాంక్షించారు. ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను స్పీకర్‌గా పనిచేసిన సభలో 12 పార్టీలు ఉండేవని, అప్పట్లో సభను కామన్సెన్స్ నడిపిందని వివరించారు. చట్టసభల్లో అర్థవంతమైన చర్చల ద్వారానే ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

