మరో నేత కార్మికుడి ఆత్మహత్య
ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువై.. బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక సిరిసిల్ల వస్త్రపరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుపోతుండగా.. నేతన్నలు బలవన్మరణాల బాట పడుతున్నారు.
- ఉపాధి కరువై.. బతుకు బరువై
- సిరిసిల్లలో సైజింగ్ కార్మికుడి బలవన్మరణం
రాజన్న సిరిసిల్ల, జూలై 3 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువై.. బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక సిరిసిల్ల వస్త్రపరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుపోతుండగా.. నేతన్నలు బలవన్మరణాల బాట పడుతున్నారు. తాజాగా బుధవారం మరమగ్గాల అనుబంధ పరిశ్రమైన సైజింగ్‌లు నడవక ఓ కార్మికుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం..
సిరిసిల్లలోని బీవైనగర్‌కు చెందిన పల్లె యాదగిరి (46)కి భార్య మంజుల, కూతుళ్లు లహరి, నిహారిక ఉన్నారు. మూడేండ్ల క్రితం పెద్ద కూతురి వివాహం చేశాడు. చిన్న కూతురు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. కొన్నేండ్లుగా సైజింగ్లో బీములు నింపే పనిచేస్తున్న ఆయనకు కొద్దిరోజులుగా పనికరువైంది. ఓ వైపు పనిలేక.. మరోవైపు కూతురి పెండ్లికి చేసిన అప్పులు తీర్చలేక ఇంట్లో తరచూ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో భార్య మంజుల పుట్టింటికి వెళ్లిపోవడంతో యాదగిరి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం ఉదయం ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. విషయం తెలియడంతో భార్య ఇంటికి చేరుకొని గుండెలవిసేలా రోదించింది. ఉపాధి దెబ్బతినడం వల్లే తన భర్త చనిపోయాడని వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసీఆర్ సర్కారు కల్పించిన బీమాలో యాదగిరి పేరు నమోదు చేసుకున్నట్టు చేనేత జౌళీశాఖ అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

