మెదక్ : మెదక్‌లో జరిగిన10వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో హన్మకొండ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఉత్కంఠగా జరిగిన ఫైనల్లో మెదక్ జట్టుపై 5-6తో గెలుపొందింది.
తూప్రాన్‌లోని టీఎస్ఆర్జేసీ బాలుర కాలేజీ మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన పోటీలు శనివారం ముగిశాయి. సెమీఫైనల్లో మెదక్ చేతిలో ఓటమి పాలైన హైదరాబాద్.. మూడో స్థానం కోసం జరిగిన పోరులో మహబూబ్‌నగర్‌ను 8-1 పాయింట్ల భారీ తేడాతో ఓడించింది.