Gutka Sales | విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్ దందా.. గుట్కా అమ్మకాల నియంత్రణపై నిఘా ఏది?
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో గుట్కా వ్యాపారం (Gutka Sales) జోరుగా సాగుతున్నది. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరి మరీ ఎక్కిరిస్తుందన్న సామెతలా తయారైంది ఇప్పుడు అక్రమ గుట్కా వ్యాపారుల తీరు.
సారంగాపూర్, జూలై 4: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో గుట్కా వ్యాపారం (Gutka Sales) జోరుగా సాగుతున్నది. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరి మరీ ఎక్కిరిస్తుందన్న సామెతలా తయారైంది ఇప్పుడు అక్రమ గుట్కా వ్యాపారుల తీరు. గుట్కా అమ్మగాలపై నిషేధం ఉన్నప్పటికీ సంబంధిత శాఖల అధికారుల నిఘా లేకపోవడంతో మండలంలో విచ్చలవిడిగా గుట్కా అమ్మకాలు చేపడుతూ లక్షల రూపాయల సొమ్ము చేసుకుంటున్నారు. గుట్కా వ్యాపారులు అక్రమంగా అమ్మకాలు చేపట్టొద్దని సంబంధిత అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. ఇటీవల కాలంలో దీనిపై అధికారులు ఎవరూ అజమాషి చేయకపోవడంతో అక్రమ వ్యాపారులు ఆడింది ఆట పాడిందే పాటగా వ్యాపారం గుట్టుగా కొనసాగుతుంది.
కిరాణా షాపుల్లో పుష్కలంగా గుట్కా అమ్మకాలు
మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లోని కిరాణా షాపుల్లో, పాన్ షాపులలో నిషేధ గుట్కాలను పుష్కలంగా అమ్ముతున్నారు. అధికారులు ఎవ్వరు కిరాణా, పాన్ షాపులపై కన్నెత్తి కూడా చూడకపోవడంతో వారి వ్యాపారం మూడుపువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఈ గుట్కాలు అమ్ముతున్న వారు ఇతర రాష్ట్రాల నుండి ఎంతో గోప్యంగా తీసుకువచ్చి చిరు వ్యాపారులు, పాన్ షాప్ లకు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేస్తున్న పాన్ షాప్, చిల్లర దుకాణాల వ్యాపారులు వారు కొన్న ధరల కంటే రెండు రెట్లు లాభాన్ని చూసుకుని గుట్కా ప్రియులకు విక్రయిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
గుట్కాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
ఈ నిషేధిత గుట్కాలు మండలానికి ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి అంటే చత్తీస్గడ్ నుండి మండలంలోని స్వర్ణ గ్రామానికి వస్తున్నాయనే వినికిడి వినిపిస్తోంది. అక్కడ నుంచి ప్రతినిత్యం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. గుట్కా వ్యాపారం చేస్తున్న వ్యక్తి అధికార పార్టీ నాయకుడి అండదండలతో ఈ గుట్కా రవాణా చేస్తు ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా అక్రమ వ్యాపారం చేస్తున్నాడన్న ఆరోపణలు వున్నాయి. గుట్కా వ్యాపారం చేస్తున్న వ్యక్తి సంబంధిత శాఖ అధికారులకు ముడుపులు అందించడంతో సంబంధిత శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మహారాష్ట్ర కూడా ప్రతినిత్యం వాహనాల్లో గుట్కాను అక్రమ వ్యాపారం చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. స్వర్ణ గ్రామానికి కేంద్రంగానే గుట్కా దందా జోరుగా సాగుతుందని మండల వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుట్కా నిషేధాన్ని అరికట్టాలని మండల వాసులు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

