సెయిలింగ్‌లో గురుకుల కెరటాలు

- సాహస క్రీడలో సత్తాచాటుతున్న బీసీ విద్యార్థులు
- ఇండియన్ నేవీకి నలుగురు, ఆర్మీకి ఇద్దరు ఎంపిక
- మంత్రి గంగుల కమలాకర్ అభినందన
హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): బీసీ గురుకుల విద్యార్థులు చదువులతోపాటు విభిన్న క్రీడల్లోనూ రాణిస్తున్నారు. సెయిలింగ్ వంటి ఖరీదైన, కఠినమైన, సాహసక్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తున్నారు. తాజాగా ఆరుగురు జ్యోతిబాపూలే గురుకుల విద్యార్థులు సెయిలింగ్‌కు ఎంపికయ్యారు. వీరిలో 8, 9వ తరగతి విద్యార్థులు కే అభిరామ్, కే నితిన్, జీ మల్లేశ్, కార్తీక్ ఇండియన్ నేవీకి ఎంపికయ్యారు. మరో ఇద్దరు సీ సంతోష్, ఆర్ చింటూ ఆర్మీకి ఎంపికయ్యారు. ఈ ఆరుగురు విద్యార్థులు వచ్చే జూలై 4న నిర్వహించే ఏషియన్ గేమ్స్ అర్హత పోటీలకు ఎంపికవ్వడం మరో విశే షం. వీరి ప్రతిభ ఇతరులకు స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో టీ శాట్ నెట్వర్క్ చానెల్లో గురువారం ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఎంపికైన ఆరుగురు బీసీ గురుకుల విద్యార్థులు గురువారం బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను హైదరాబాద్‌లో మంత్రుల నివాసంలో కలిశారు. మంత్రి వారిని అభినందించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య భట్టు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

