Suryapet | సూర్యాపేటలో మరో గురుకుల విద్యార్థిని బలవన్మరణం
సూర్యాపేటలో (Suryapet) జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హోం సిక్ లీవుల్లో ఇంటికి వెళ్లిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది.
సూర్యాపేట: సూర్యాపేటలో (Suryapet) జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హోం సిక్ లీవుల్లో ఇంటికి వెళ్లిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. మోతె మండలం బుర్కచర్ల గ్రామానికి చెందిన ఇరుగు ఆనంద్-జ్యోతి దంపతుల కుమార్తె అస్మిత.. ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదవుతున్నది. అయితే ఈ నెల 10న అదే గురుకుల స్కూల్లో ఇంటర్మీడియట్ సెకండియర్ చదవుతున్న విద్యార్థిని వైష్ణవి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈనేపథ్యంలో పాఠశాలలో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా ఉండటానికి నాలుగు రోజులపాటు హోం సిక్ సెలవులు ఇచ్చారు. దీంతో అస్మిక తన ఇంటికి వచ్చింది.
కాగా, రోజువారీ లానే అస్మిక తల్లి జ్యోతి శనివారం ఉదయం కూలి పనికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని కనిపింది. అయితే అదే రోజు ఆమె స్కూల్‌కు తిరిగి వెళ్లాల్సి ఉన్నది. దీంతో అస్మిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

