Group 2 | రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం
Group 2 | రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ - 2 పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం 10 గంటలకు తొలి రోజు తొలి పరీక్ష ప్రారంభమైంది. పరీక్షకు గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్‌కు రావాలని టీజీపీఎస్పీ సూచించింది. అలాగే 9:30 గంటల తర్వాత గేట్లు క్లోజ్ చేస్తామని తెలిపారు.
Group 2 | రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ – 2 పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం 10 గంటలకు తొలి రోజు తొలి పరీక్ష ప్రారంభమైంది. పరీక్షకు గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్‌కు రావాలని టీజీపీఎస్పీ సూచించింది. అలాగే 9:30 గంటల తర్వాత గేట్లు క్లోజ్ చేస్తామని తెలిపారు. దీంతో చాలామంది అభ్యర్థులు సమయానికి సెంటర్‌కు చేరుకున్నారు. అయినా కొన్ని చోట్ల అభ్యర్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వచ్చారు. నిమిషం నిబంధన మేరకు వారిని సిబ్బంది ఎగ్జామ్ హాలులోకి అనుమతించలేదు. దీంతో కన్నీళ్లతోనే వారు వెనుదిరిగారు.
బేగంపేటలోని మహిళా డిగ్రీ కాలేజీలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం పరిశీలించారు. గ్రూప్-2 పరీక్షకు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత గ్రూప్ 2 పరీక్ష జరుగుతుందని.. అభ్యర్థులు ఆందోళన లేకుండా పరీక్ష రాయాలని సూచించారు. గ్రూప్ 3 కంటే ఎక్కువ శాతం మంది ఈ పరీక్షకు హాజరవుతున్నారని పేర్కొన్నారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తొలి సెషన్లో పరీక్ష జరగనుంది. రెండో సెషన్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30వరకు పరీక్ష నిర్వహించనున్నారు. నాలుగు పేపర్లకు రాష్ట్రవ్యాప్తంగా 1,368 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది మార్చిలో ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. కాగా,783 పోస్టుల భర్తీకి కేసీఆర్ ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్‌ను జారీచేయగా, పలు కారణాలతో పరీక్ష నాలుగుసార్లు వాయిదాపడింది. ఈ పరీక్ష కోసం 5,51,847 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో లక్షకు పైగా అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోలేదని తెలుస్తోంది.

1group2

2group2
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

