New Year | హైదరాబాద్/సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ): డిసెంబర్ 31 ఒక్కరోజే గ్రేటర్ హైదరాబాద్‌లో నిమిషానికి 1,244 బిర్యానీల ఆర్డర్ వచ్చినట్టు ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తెలిపింది. హైదరాబాదీలు ఏకంగా 4.8 లక్షల బిర్యానీల ఆర్డర్‌తో గత రికార్డులను తిరగరాసినట్టు పేర్కొన్నది. గతంలో కంటే 1.6 రేట్లు ఆర్డర్లను ఆందుకున్నామని, వరల్డ్ కప్- 2023 ఫైనల్ సందర్భంగా ఈ తరహా ఆర్డర్లు వచ్చినా… అప్పుడు వచ్చిన దాని కంటే 1.3 లక్షల ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయని స్విగ్గీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిమిషానికి 1,722 కండోమ్‌లను ఆర్డర్ చేయగా, వీటిని స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ ద్వారా డెలివరీ చేసినట్టు స్విగ్గీ తెలిపింది.