రెండో దశ చెక్ డ్యాములను మంజూరు చేయండి : ఎమ్మెల్యే ఆల
ఎమ్మెల్యే ఆల | రెండో దశలో భాగంగా ఇంకా నిర్మించాల్సిన చెక్ డ్యాంల కోసం నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.

మహబూబ్ నగర్ : సీఎం కేసీఆర్ చెప్పినట్లు వాగుల మీద చెక్ డ్యామ్ లు నిర్మించాలనేది చాలా గొప్ప ఆలోచన అని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో అవర్లో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం చెప్పినట్లుగానే దేవరకద్ర నియోజకవర్గంలో కూడా కోయిల్ సాగర్ నుంచి రామన్ పాడ్ వరకు, నిజాలపూర్ నుంచి సరళా సాగర్ వరకు రెండు పెద్ద వాగుల మీద తొలిదశలో చెక్ డ్యామ్ లు నిర్మించినామన్నారు.
ఆ చెక్ డ్యామ్లు పూర్తి అయి ఒక్కో చెక్ డ్యామ్ దగ్గర దాదాపు 2 కిలోమీటర్ల మేర నీళ్లు ఆగి.. భూగర్భ జలాలు భారీగా పెరిగాయని ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ఇంకా కొన్ని చోట్ల చెక్ డ్యామ్ లు అవసరం ఉన్నాయన్నారు. రెండో దశలో భాగంగా ఇంకా నిర్మించాల్సిన చెక్ డ్యాంల కోసం నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.
రెండో దశ కింద చెక్ డ్యామ్ లు మంజూరు చేస్తే ముఖ్యమంత్రి ఆలోచన ద్వారా ఇప్పుడు గోదావరి 130 కిలోమీటర్లు సజీవంగా ఎలా వుందో మా రెండు వాగులు కూడా సజీవంగా ఉంటాయన్నారు.
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరిన చెక్ డ్యామ్ ల అంశాన్ని నోట్ చేసుకున్నామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మిగిలి పోయిన చెక్ డ్యామ్ లను మంజూరు చేస్తామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

