ధాన్యం రవాణాకు ఆర్టీసీ కార్గో

సర్వీసుల కోసం ఆర్టీసీకి పౌరసరఫరాలశాఖ లేఖ
కల్లాలు, కేంద్రాల నుంచి తరలింపు సమస్యకు చెక్
హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కల్లాలు, కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపునకు ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సర్వీసులను ఏర్పాటుచేయాలని కోరుతూ పౌరసరఫరాల ఆర్టీసీకి లేఖ రాసింది. ఇందుకు సుముఖత వ్యక్తంచేసిన ఆర్టీసీ అధికారులు.. ఏఏ జిల్లాలో ఎక్కడెక్కడ రవాణా సౌకర్యం అవసరం ఉన్నదో పరిశీలించి కార్గో సేవలను ఏర్పాటుచేసే చర్యలు తీసుకుంటున్నారు. యాసంగిలో ధాన్యం దిగుబడి భారీగా ఉండటంతో కొనుగోలు కేంద్రాలన్నీ నిండిపోతున్నాయి. కేంద్రాల నుంచి ధాన్యం తరలింపునకు కరోనా కారణంగా కాంట్రాక్టర్లు అనుకున్న స్థాయిలో వాహనాలను సమకూర్చలేకపోయారు. దీంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యను పరిష్కరించేందుకు పౌరసరఫరాలశాఖ కార్గో సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. రైతులకు కూడా కల్లాల నుంచి కూడా ధాన్యాన్ని తరలించేందుకు వీలుగా కార్గో సేవలు అందించాలని అధికారులు యోచిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

