ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు తెరపడింది. ఆదివారం పోలింగ్ నేపథ్యంలో 48 గంటల ముందు ఎన్నికల సంఘం నియమావళికి అనుగుణంగా అభ్యర్థులు ప్రచారం ముగించారు. ఫిబ్రవరి 16న ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో నెల రోజులుగా ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనాలు, సదస్సులు, సమావేశాలు నిర్వహించి ఓటర్లకు దగ్గరయ్యేందుకు అన్నివిధాలా కృషిచేశారు.
నల్లగొండ-ఖమ్మం- వరంగల్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 14న పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో కొనసాగనుండటంతో బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేస్తున్నారు. పోలింగ్ ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఈ నెల 14 వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఈసీ ఆదేశించింది. ఈ నెల 17న ఓట్ల లెక్కింపు సందర్భంగా మద్యం దుకాణాలు తెరవొద్దని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

