High Court | పునఃపరిశీలన, తిరస్కరణ వేర్వేరు.. ఎమ్మెల్సీల కేసులో హైకోర్టు వ్యాఖ్య
గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, ‘సియాసత్' పత్రిక ఎడిటర్ అమీర్ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నియమించడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
- తదుపరి విచారణ రేపటికి వాయిదా
High Court | హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, ‘సియాసత్’ పత్రిక ఎడిటర్ అమీర్ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నియమించడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. మంత్రివర్గ సిఫారసులకు గవర్నర్ కట్టుబడి ఉండాలని, అయితే ఆ సిఫార్సులను పరిశీలించే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉంటుందని ప్రతివాదుల తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదించారు. ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను నియమించాలంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రివర్గం చేసిన సిఫారసును గవర్నర్ తిరస్కరించారని, ఆ తర్వాత బీఆర్ఎస్ మంత్రివర్గం మళ్లీ అవే పేర్లను పునఃపరిశీలించాలని సిఫారసు చేసి ఉంటే గవర్నర్ ఆమోదించి ఉండేవారని చెప్పారు.
కోదండరాం, అలీఖాన్ పేర్లను గత డిసెంబర్లో మంత్రివర్గం ఆమోదించిందని, ఎమ్మెల్సీలుగా నియమించేందుకు కావాల్సిన అన్ని అర్హతలు వారికి ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్సీలుగా నియమితులైన వారికి అర్హతలు ఉన్నా, లేకపోయినా వారి నియామక జీవోలను సవాలు చేయవచ్చని, అలా కాకుండా తమను ఎమ్మెల్సీలుగా నియమించాలని కోరే హకు ఎవరికీ ఉండదని తెలిపారు. మంత్రి మండలి, గవర్నర్ల కంటే రాజ్యాంగం అత్యున్నతమైనదని చెప్పారు. గవర్నర్ విచక్షణాధికారాలపై న్యాయసమీక్షకు ఆసారం లేదని సుప్రీంకోర్టు ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేసిందని గుర్తుచేశారు. దీంతో మంత్రివర్గ సిఫారసులను తిరస్కరించడం, పునఃపరిశీలించడం వేర్వేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంపై తమ వాదన వినిపించేందుకు గడువు కావాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరడంతో విచారణ ఈ నెల 14కు వాయిదా పడింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

