ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ వైద్యం
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి | తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు.

జోగులాంబ గద్వాల : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా దవాఖానలో హోప్ పౌండేషన్ వారు అందజేసిన అంబులెన్స్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అత్యవసర సమయంలో రోగులను ఇతర వైద్యశాలకు తరలించడానికి ఈ అంబులెన్సు ఉపయోగపడుతుందన్నారు.
అలాగే దవాఖాన ఆవరణలో 250 పడకలకు అవసరమయ్యే ఆక్సిజన్ ప్లాంట్ రెడ్డీస్ ల్యాబ్ వారు అందజేయగా ప్లాంటు నిర్మాణానికి భూమి పూజ చేశారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో మరో వంద పడకల కు అవసరమయ్యే ఆక్సిజన్ ప్లాంట్ త్వరలో దవాఖానాలు అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.
జిల్లా కేంద్రంలో త్వరలో 3 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో చందు నాయక్, పురపాలక చైర్మన్ కేశవ్, ఎంపీపీలు ప్రతాప్ గౌడ్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

