అల్లర్ల వెనుక ఎంతటివారున్నా వదిలిపెట్టం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ : భైంసా అల్లర్ల వెనుక ఎంతటివారున్నా వదిలిపెట్టమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇటీవల ఘర్షణలు చోటుచేసుకున్న మహాగావ్ గ్రామంతోపాటు భైంసా పట్టణంలో శనివారం ఆయన పర్యటించి, బాధితులను పరామర్శించారు. అధైర్యపడొద్దని అన్నివిధాలా అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం అతిథిగృహంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. భైంసా పట్టణంలో చోటుచేసుకున్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. జనజీవనం స్తంభించడంతో నిరుపేదలు, సామాన్యులు, చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
వరుస ఘటన వల్ల భైంసాలో అభివృద్ధి కుంటుపడుతుందని, దీని ప్రభావం పరిసర ప్రాంతాలపైనా పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా రాజకీయాలకు అతీతంగా కృషిచేయాలని సూచించారు. కొన్ని పార్టీలు ఇలాంటి ఘటనలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం బాధకరమని, అల్లర్ల వెనుక ఎవరి హస్తం ఉందో అందరికీ తెలుసన్నారు. భైంసా ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని, దీని వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తప్పవన్నారు. జర్నలిస్టులపై దాడి విచారకరమని.. దాడిని తీవ్రంగా ఖండించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెంట ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ విష్ణు వారియర్, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిదులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

