Protest in Nagarkarnool | రేవంత్ రెడ్డి ముఖంపై దున్నపోతుల పెండ.. నాగర్‌కర్నూల్‌లో గొల్ల కురుమల ధర్నా
Protest in Nagarkarnool | తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గొల్ల కురుమ, యాదవ సోదరులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు.
నాగర్‌కర్నూల్ | తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గొల్ల కురుమ, యాదవ సోదరులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఇవాళ నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో గొల్ల కురుమలు, యాదవులు ధర్నా నిర్వహించారు. అంతేగాక రేవంత్ రెడ్డి పోస్టర్‌లోని అతని ముఖంపై దున్నపోతుల పెండ కొట్టి భారీ ర్యాలీ తీశారు.
గొల్ల కురుమలు, యాదవులను కించపర్చేలా వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి తమకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్‌రెడ్డికి, ఆయన పార్టీకి తాము తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కాగా, పేడ పిసుక్కుని బతికిన తలసాని శ్రీనివాస్ యాదవ్ నా గురించి మాట్లాడుతాడా అంటూ ఇటీవల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దాంతో తమ జాతులను అవమానించారంటూ గొల్ల కురుమలు, యాదవులు ఆగ్రహం వ్యక్తం చేశారు.




Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

