Whatsapp Group | డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు “పోలీస్ మామలు” పేరుతో ఏర్పాటు చేసిన ఓ వాట్సాప్ గ్రూప్ ఇప్పుడు బట్టబయలైంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ వ్యక్తి ఫోన్ చెక్ చేయడంతో ఈ వాట్సాప్ గ్రూప్ వెలుగులోకి వచ్చింది.
గోదావరిఖని పట్టణంలో ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తు్నారు? ఎక్కడ వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారనే విషయాన్ని గ్రూప్ సభ్యులు అందులో ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. దీనిద్వారా వాహనాల తనిఖీల నుంచి తప్పించుకుంటున్నారు. ఈ వాట్సాప్ గ్రూప్ గురించి తాజాగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఆ గ్రూప్‌లో 1024 సభ్యులు ఉన్నారు. దీంతో ఆ గ్రూప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఎస్సై స్వయంగా ఆ గ్రూపులో జాయిన్ అయ్యారు.
పోలీస్ మామలు గ్రూపులో ఎస్సై జాయిన్ అయ్యాడనే విషయం తెలియగానే.. ఆ గ్రూప్‌లోని సభ్యులు ఒక్కొక్కరుగా గ్రూప్‌ను వీడటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన ఎస్సై ఒక వీడియో తీసి అదే వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశారు. ‘మీ ఫోన్ నంబర్లు అన్నీ సేవ్ చేసుకున్నా. త్వరలోనే మీ అందరికీ కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తా’ అంటూ ఒక వీడియోను వాట్సాప్ గ్రూప్‌లో పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
“పోలీస్ మామలు” అంటూ వాట్సాప్ గ్రూప్.. ఎస్ఐ ఎంట్రీతో గ్రూప్ వీడిన సభ్యులు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ వ్యక్తి ఫోన్ చెక్ చేయగా, “పోలీస్ మామలు” అనే వాట్సప్ గ్రూప్ గుర్తించిన పోలీసులు
డ్రంక్ అండ్ డ్రైవ్, ఇతర తనిఖీల గురించి ఈ గ్రూప్… pic.twitter.com/bQxCAYITw1
— Telugu Scribe (@TeluguScribe) April 4, 2026