Goat Milk | జీర్ణశక్తికి మేక పాలు.. గ్యాస్, ఉబ్బరం సమస్య మటుమాయం
Goat Milk | జీర్ణశక్తికి మేక పాలు ఎంతో శ్రేష్ఠమైనవని నిపుణులు సూచిస్తున్నారు. పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ పాలలో ఆవు పాలతో సమానమైన కొవ్వు పదార్థం ఉంటుందని పేర్కొంటున్నారు.
- ఆవు పాల కన్నా 12% లాక్టోస్ తక్కువ
హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): జీర్ణశక్తికి మేక పాలు ఎంతో శ్రేష్ఠమైనవని నిపుణులు సూచిస్తున్నారు. పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ పాలలో ఆవు పాలతో సమానమైన కొవ్వు పదార్థం ఉంటుందని పేర్కొంటున్నారు. ఆవు, బర్రె పాలతో పోల్చితే తక్కువ ధర ఉండే మేక పాలు త్వరగా జీర్ణం అవుతాయని, పొట్టలో గ్యాస్, ఉబ్బర సమస్యలు రావని చెప్తున్నారు. ‘మేక పాలు కడుపులోకి వెళ్లిన తర్వాత పెరుగుగా మారుతుంది.
ఈ పెరుగు ఆవు పాలతో చేసిన పెరుగు కంటే మెత్తగా ఉంటుంది. ఆవు పాలలో 10 శాతం పెరుగు ఉంటే, మేక పాలలో 2 శాతం మాత్రమే ఉంటుంది. ఇది శరీర జీర్ణక్రియకు సహాయపడుతుంది’ అని వివరిస్తున్నారు. ప్రస్తుతం ముంబై, కోల్కతా, బెంగళూరు వంటి నగరాల్లో మేకపాలతో చేసిన ఉత్పత్తులను అధికంగా వినియోగిస్తున్నారని పేర్కొంటున్నారు.
మేక పాలలో ఆరోగ్య గుణాలు
- మేకపాలలో ఫ్యాటీ యాసిడ్స్, ఒలిగోశాకరైడ్లు ఉంటాయి. వీటిలో యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. శరీరంలో మంటను తగ్గించి, రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
- ఒక కప్పు మేక పాలలో ఆవు పాల కంటే 12 శాతం తకువ లాక్టోస్ ఉంటుంది. లాక్టోస్ సెన్సిటివిటీ ఉన్నవాళ్లు మేకపాలు తాగొచ్చు.
- ఈ పాలలో ప్రీబయాటిక్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి కడుపులో మంచి బ్యాక్టీరియా పెరుగదలకు తోడ్పడుతాయి.
- మేక పాలలో విటమిన్-ఏ, బీ కాంప్లెక్స్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం ఉంటాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

