Jagitial | బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు ప్రత్యక్షం.. ఉపాధ్యాయుల నిర్లక్ష్యపు సమాధానం..
Jagitial | బడిని గుడిలా భావిస్తారు. గుడిని ఎంత పవిత్రంగా ఉంచుకుంటామో.. బడిని కూడా అంతే పవిత్రంగా ఉంచుకోవాలి. కానీ ఈ పాఠశాల మాత్రం అపవిత్రంగా మారింది.
Jagitial | జగిత్యాల : బడిని గుడిలా భావిస్తారు. గుడిని ఎంత పవిత్రంగా ఉంచుకుంటామో.. బడిని కూడా అంతే పవిత్రంగా ఉంచుకోవాలి. కానీ ఈ పాఠశాల మాత్రం అపవిత్రంగా మారింది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పాఠశాల ఆవరణలో పలు చోట్ల కండోమ్ ప్యాకెట్లు ప్రత్యక్షమయ్యాయి.
రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగిత్యాల సీఎస్ఐ బాలికల ఉన్నత పాఠశాలను శుభ్రం చేయించేందుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. అది కూడా అటెండర్లతో కాకుండా.. విద్యార్థినుల చేత శుభ్రం చేయించారు. స్కూల్ ఆవరణలో ఉన్న చెత్తను అమ్మాయిలు ఊడ్చుతుండగా.. వారి కంట కండోమ్ ప్యాకెట్లు కనిపించాయి. ఆందోళనకు గురైన విద్యార్థినులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ టీచర్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా మాట్లాడారు.
ఈ విషయం మీడియా ప్రతినిధులకు, విద్యార్థినుల తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో పాఠశాల హెడ్మాస్టర్ సీఎస్ఐ చర్చ సెక్రటరినీ ప్రశ్నించగా.. సమాజంలో ఇదంతా సహజమేనని, దానికి మేం ఏం చేయాలని నిర్లక్ష్యంగా మాట్లాడారు. అసాంఘిక కార్యకలాపాలకు తాము కాపలా ఉండాలా అంటూ ఉపాధ్యాయుల నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. దీనిపై డీఈవో రాములును వివరణ కోరగా వెంటనే ఎంఈఓను పంపించి వివరాలు సేకరించి వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.
బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు
కండోమ్ ప్యాకెట్లను విద్యార్థినులతో శుభ్రం చేయిస్తున్న ఉపాధ్యాయులు
జగిత్యాల సీఎస్ఐ బాలికల ఉన్నత పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు, మద్యం సీసాలు
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన బాలికల పాఠశాల
అటెండర్ లేడని, విద్యార్థినుల చేత కండోమ్ ప్యాకెట్లను… pic.twitter.com/FingbH0MI8
— Telugu Scribe (@TeluguScribe) January 25, 2025
ఇవి కూడా చదవండి..
Nagarkurnool | విద్యార్థినులు నవ్వారని చెప్పుతో కొట్టిన ఉపాధ్యాయుడు..
TG Highcourt | తెలంగాణ హైకోర్టులో నలుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
Minister Seethakka | డీజే టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి సీతక్క.. Video
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

