సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూకృష్ణన్ పిలుపునిచ్చారు..
- ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణణ్
హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూకృష్ణన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నరసింహారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు మూడ్ శోభన్, లెల్లెల బాలకృష్ణలతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజూ కృష్ణణ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రైతులు చాలా దారుణమైన సంక్షోభంలో ఉన్నారని తెలిపారు.
మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక సరళీకరణ విధానాల కారణంగా ఈ సంక్షోభం మరింత పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. దీనికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల్లో పోరాటాలు జరుగుతున్నాయని వివరించారు. 2014 నుంచి 2026 వరకు దేశంలో దాదాపు 5 లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అఖిలభారత కిసాన్ సభ, వ్యవసాయ కార్మిక సంఘాలు, మహిళా, యువజన, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో పాల్గొంటారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

