హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరంలోని గుండ్లకమ్మ రిజర్వాయర్ రెండో గేటు శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. ఏడాది క్రితం ఒక గేటు కొట్టుకుపోగా, ప్రస్తుతం తుఫానుతో మరో గేటు కొట్టుకుపోవడంతో నీరు వృథాగా పోతున్నది.
దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారయంత్రాంగం హెచ్చరించింది.