గార్మెంట్స్ కింగ్ కిటెక్స్

50 ఏండ్ల ఘనచరిత్ర.. ప్రపంచంలోనే టాప్-2
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): కిటెక్స్ గ్రూప్‌నకు 50 ఏండ్లకుపైగా చరిత్ర ఉన్నది. కేరళకు చెందిన ఎంసీ జాకబ్ 1968లో కేరళలోని ఎర్నాకుళం జిల్లా కిజకంబళంలో ‘అన్నా కిటెక్స్ గ్రూప్’ను స్థాపించారు. మొదట్లో అల్యూమినియం ఉత్పత్తులు తయారుచేసేవారు. తర్వాత మసాలాలు, టెక్స్టైల్స్, స్కూల్, ట్రావెల్ బ్యాగ్స్.. ఇలా అనేక రంగాల్లోకి విస్తరించారు. 1992లో ఎంసీ జాకబ్ కుమారుడు సాబు ఎం జాకబ్ ‘కిటెక్స్ గార్మెంట్స్’ను స్థాపించారు. ఈ కంపెనీ తన ఉత్పత్తుల్లో 90 శాతం అమెరికా, యురోపియన్ యూనియన్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంది. ప్రధానంగా ‘లిటిల్ స్టార్’ బ్రాండ్ పేరుతో చిన్నపిల్లల దుస్తులను తయారుచేస్తున్నది. ఈ విభాగంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కంపెనీగా కిటెక్స్ గార్మెంట్స్ కొనసాగుతున్నది.
- కిటెక్స్ గార్మెంట్స్ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 4.32 లక్షల యూనిట్లు. దాదాపు రూ.1,000 కోట్ల టర్నోవర్‌తో ఏటా సుమారు రూ.15 వేల కోట్ల ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న ఈ సంస్థలో ప్రస్తుతం 11వేల మంది ఉద్యోగులున్నారు. ఈ కంపెనీ ఏటా ప్రభుత్వానికి సుమారు రూ.160 కోట్ల పన్ను చెల్లిస్తున్నది.
- 2020 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కిటెక్స్ గార్మెంట్స్ రూ.784 కోట్ల టర్నోవర్ సాధించింది. రూ.109 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ కంపెనీ స్టాక్ ఎక్సేంజీల్లో 1995లో లిస్టయ్యింది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 55.57 శాతంగా ఉన్నది.
- ప్రఖ్యాత పత్రిక ‘ఫోర్బ్స్’ ఎంపిక చేసిన ఆసియాలోని ఉత్తమ కంపెనీల జాబితాలో కిటెక్స్ ఒకటి.
- సామాజిక బాధ్యతలో భాగంగా కిటెక్స్ ‘ట్వంటీ 20’ సంస్థను ప్రారంభించింది. కేరళలోని కిజకంబళంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో గృహ నిర్మాణం, ఆహారసరఫరా, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం వంటి సదుపాయాల్ని ప్రజలకు అందిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.6.76 కోట్లు ఖర్చు చేసింది.
రాజకీయ పార్టీని స్థాపించి మూడు పంచాయతీలను కూడా గెలుచుకున్నది. - అమెరికా, యూరప్‌ల్లో చిన్న పిల్లల దుస్తులను ఏ బ్రాండ్‌లో కొన్నా.. చాలావరకూ అవి ఇండియాలో కిటెక్స్ గార్మెంట్స్ ఉత్పత్తి చేసినవే అంటే అతిశయోక్తి కాదు. ఇన్ఫాంట్వేర్, చిల్డ్రన్వేర్ తయారు చేయడంలో కిటెక్స్కున్న ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించింది.
- కిటెక్స్ అంతర్జాతీయ క్లయింట్ల జాబితాలో మదర్‌కేర్, జాకీ, జేసీ పెన్నీ, వాల్‌మార్ట్, సారాలీ, గెర్బర్ చిల్ట్రన్వేర్ వంటి ప్రఖ్యాత సంస్థలున్నాయి.
20% లాభపడిన కిటెక్స్ షేర్లు
తెలంగాణ ప్రభుత్వంతో కిటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ ప్రతినిధులు పెట్టుబడుల చర్చలు జరుపుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆ సంస్థ షేర్ల విలువ ఒక్కసారిగా పెరిగింది. స్టాక్‌మార్కెట్లలో ఒక్కో షేర్ ఏకంగా 20 శాతం లాభపడటం గమనార్హం. నిజానికి అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) నష్టాల్లో ముగిసినా.. కిటెక్స్ షేర్లు మాత్రం మదుపరులను విపరీతంగా ఆకట్టుకోవడం విశేషం. ఈ క్రమంలోనే బీఎస్ఈలో 19.72 శాతం ఎగిసి రూ.140.55 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈలోనూ 19.97 శాతం ఎగబాకి రూ.140.85 వద్ద నిలిచింది. దీంతో రెండు సూచీల్లోనూ సంస్థ షేర్ విలువ 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. గురువారం కంపెనీ షేర్ విలువ బీఎస్ఈలో రూ.117.40 వద్ద, ఎన్ఎస్ఈలో రూ.117.75 వద్ద ముగిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Kerala
- Kitex Garments
- mc jacab
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

