ఖైరతాబాద్, అక్టోబర్ 7: గంగపుత్రుల సొసైటీలను తన అనుయాయులకు కేటాయించేందుకు మంత్రి వాకిటి శ్రీహరి కుట్రజేస్తున్నాడని గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు మంగళపల్లి శంకర్ గంగపుత్ర ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తన పదవిని దుర్వినియోగం చేస్తూ, సొంత కులానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
సంప్రదాయ మత్స్యకారులుగా ఉన్న గంగపుత్రుల సొసైటీలను కబ్జా చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీసీ- ఏ రిజర్వేషన్లలోకి తమ కులాన్ని జొప్పించేందుకు, మత్స్య ఫెడరేషన్ చైర్మన్ పదవిని తమ వర్గానికి ఇప్పించుకునేందుకు తెర వెనుక ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. తక్షణమే వాకిటి శ్రీహరి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.