పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
Petrol bunk | పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో నలుగురు సభ్యులను హైదరాబాద్ బాలానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

హైదరాబాద్: పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో నలుగురు సభ్యులను హైదరాబాద్ బాలానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను డీసీపీ పద్మజ మీడియా ముందు హాజరుపరిచారు. ఈ ముఠా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్నదని చెప్పారు. తక్కువ పెట్రోల్ వచ్చేలా ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రూపొందించారని, చిప్‌లను పెట్రోల్ బంకుల్లో అమరుస్తున్నారని చెప్పారు.
నిందితులంతా గతంలో పెట్రోల్ బంకుల్లో పనిచేశారని చెప్పారు. బంకు యజమానులు, నిందితులు కుమ్మక్కయ్యారని వెల్లడించారు. చిప్‌ల ఏర్పాటుతో లీటరుకు 30 నుంచి 50 మిల్లీ లీటర్లు తక్కువగా వస్తున్నదని డీసీపీ తెలిపారు. ఇలా మూడు రాష్ట్రాల్లోని 34 బంకుల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని చెప్పారు. ఇందులో తెలంగాణలో ఆరు పెట్రోల్ బంకులు, ఏపీ, కర్ణాటకలో 28 బంకులు ఉన్నాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

