18 నెలల్లో వరంగల్ దవాఖాన సిద్ధం
వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణం పనులు 18 నెలల్లో పూర్తి కానున్నాయి. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖకు, నిర్మాణ సంస్థ ఎల్అండ్టీకి కుదిరిన ఒప్పందం ప్రకారం 2023 సెప్టెంబర్ నాటికి భవన నిర్మాణ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ దవాఖానను 19 ఎకరాల విస్తీర్ణంలో
2023 సెప్టెంబర్ నాటికి నిర్మాణం పూర్తి
19 ఎకరాలు.. 27 అంతస్తులతో భవనం
వేసవి ముగిసేలోగా ఫుటింగ్ పనులు పూర్తి
ఎల్అండ్టీకి 1,116 కోట్లతో కాంట్రాక్ట్
హైదరాబాద్, ఏప్రిల్ 5 : వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణం పనులు 18 నెలల్లో పూర్తి కానున్నాయి. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖకు, నిర్మాణ సంస్థ ఎల్అండ్టీకి కుదిరిన ఒప్పందం ప్రకారం 2023 సెప్టెంబర్ నాటికి భవన నిర్మాణ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ దవాఖానను 19 ఎకరాల విస్తీర్ణంలో 27 అంతస్తులతో నిర్మించనున్నారు. రూ.1,116 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు ఎల్ అండీ టీ సంస్థ ఈ నెల 4న అంగీకారపత్రం (లెటర్ ఆఫ్ ఆక్సెప్టెన్సీ) అందుకొన్నది. ఎండాకాలం ముగిసేలోగా మట్టి, ఫుటింగ్ పనులు పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే బ్లాక్‌లవారీగా నిర్మాణ పనులను చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దవాఖాన నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖకు అప్పగించారు. దీంతో ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఈఎన్సీ గణపతిరెడ్డి పర్యవేక్షణలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, నిర్మాణ బాధ్యతలను ఎల్అండ్టీకి అప్పగించారు. మెట్రోరైల్ లాంటి అనేక భారీ ప్రాజెక్టులను చేపట్టిన అనుభవం ఉన్న ఎల్అండ్టీ సకాలంలో నిర్మాణం పూర్తి చేయగలదన్న విశ్వాసం వ్యక్తమవుతున్నది.
దవాఖాన ప్రత్యేకతలు
- మొత్తం రెండువేల పడకలతో దవాఖానను నిర్మించనున్నారు.
- ఇందులో 1,200 పడకలను జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్ విభాగాలకు కేటాయిస్తారు.
- మరో 800 బెడ్స్‌ను అంకాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్స్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, కార్డియాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ తదితర విభాగాలకు కేటాయిస్తారు.
- ఇదే ప్రాంగణంలో దంత వైద్య కళాశాలను కూడా నిర్వహిస్తారు.
- కిడ్నీ, కాలేయం వంటి అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేస్తారు.
- అత్యాధునిక క్యాన్సర్ కేంద్రం నెలకొల్పుతారు.
- రోగులతో పాటు వచ్చే సహాయకులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారు.
- వైద్య విద్యార్థులు, సిబ్బందికి వసతి సౌకర్యం
- అత్యవసర పరిస్థితుల్లో రోగులను హెలికాప్టర్లో తరలించడానికి వీలుగా దవాఖాన వద్ద హెలిప్యాడ్‌ను సైతం నిర్మిస్తారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

