హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): టీ వర్క్స్‌తో తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్‌టీసీసీఐ) ఒప్పందం చేసుకొన్నది. విద్యార్థి దశలోనే పరిశ్రమల్లో పనితీరుపై అవగాహన కల్పిస్తూ, ఇంటర్న్‌షిప్‌ల ద్వారా ఉద్యోగాల కల్పనకు అవసరమైన నైపుణ్యాల పెంపునకు ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి.