Minister KTR | మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం..
Minister KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలు, దేశాల నుంచి ఆహ్వానం అందుకున్న మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం దక్కింది.

హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలు, దేశాల నుంచి ఆహ్వానం అందుకున్న మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం దక్కింది. ఈ నెల 29న ఫ్రెంచ్ సెనేట్‌లో జరిగే అంబీషన్ ఇండియా -2021 సదస్సులో ప్రసంగించాలని కేటీఆర్‌కు ఫ్రెంచ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఫ్రెంచ్ ప్రధానమంత్రి ఇమ్మాన్యూల్ మాక్రోన్ సారథ్యంలో నిర్వహించే ఈ సదస్సు భారత్ – ఫ్రెంచ్ దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతానికి దోహదం చేస్తుందని కేటీఆర్‌కు పంపిన లేఖలో ఫ్రెంచ్ ప్రభుత్వం పేర్కొన్నది. అంబీషన్ ఇండియా 2021 సదస్సులో కీనోట్ స్పీకర్‌గా గ్రోత్ – డ్రాఫ్టింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ ఇన్ పోస్ట్ కోవిడ్ ఎరా(era) అనే అంశం పైన తన అభిప్రాయాలు పంచుకోవాలని మంత్రి కేటీఆర్‌ను ఫ్రెంచ్ ప్రభుత్వం కోరింది.
గతంలో నిర్వహించిన అంబీషన్ ఇండియా సదస్సులో సుమారు 700 మంది వ్యాపార, వాణిజ్య భాగస్వాములు, 400కు పైగా ఇరు దేశాల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపింది. ఇప్పుడు కూడా అంతకుమించి కంపెనీల భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని, ఇలాంటి కీలకమైన వేదిక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను పరిచయం చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని ఫ్రెంచ్ ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా ఈ సదస్సులో హెల్త్ కేర్, క్లైమేట్ చేంజ్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆగ్రో బిజినెస్ వంటి ప్రధానమైన అంశాలపైన చర్చించనున్నట్లు చెప్పింది. దీంతో పాటు ఫ్రెంచ్, భారత కంపెనీల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు ఉంటాయని తెలిపింది.
మంత్రి కేటీఆర్ హర్షం
ఫ్రెంచ్ దేశ ఆహ్వానం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను పరిచయం చేసే అవకాశం కలుగుతుందన్నారు. ఫ్రెంచ్ దేశపు ఆహ్వానం తెలంగాణ ప్రభుత్వ విధానాలకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
Aadarsha Kutumbam | మూడు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ జోరు!
RC 17 | రామ్ చరణ్ ‘ఆర్సీ 17’పై మరో ప్రచారం.. గుజరాతీ బ్లాక్‌బస్టర్ రీమేక్ అంటూ టాక్స్..!
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

