ఈ నెల 16 నుంచి సాలార్జంగ్ మ్యూజియంలోకి ఫ్రీ ఎంట్రీ..!
హైదరాబాద్ : ఈ నెల 16వ తేదీ నుంచి 21 వరకు వారం రోజుల పాటు ఎలాంటి ప్రవేశం రుసుము లేకుండా సాలార్జంగ్ మ్యూజియంలోకి ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్లు మ్యూజియం డైరెక్టర్ నాగేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 18న దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం జరుగుతుందని, ఇందులో భాగంగా సాలార్జంగ్ మ్యూజియంలోనే వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఇందులో భాగంగా 16-21వ తేదీ వరకు విభిన్న కార్యక్రమాలను జరుగుతాయని, ఈ సందర్భంగా సందర్శకులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మ్యూజియం తెరిచే ఉంటుందని, కుటుంబ సమేతంగా తరలివచ్చి కార్యక్రమాలను వీక్షించాలని కోరారు. మ్యూజియంలో లైటింగ్, వాతావరణం సందర్శకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. భారత స్వాతంత్య్రాన్ని సూచించే 75 వస్తువులతో ప్రదర్శన ఉంటుందని, బిద్రి తయారీపై ఒక రోజు వర్క్‌షాప్, ఉపన్యాసం ఉంటుందని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
cop caught in woman’s home | అర్ధరాత్రి వేళ మహిళ ఇంట్లో పోలీస్ అధికారి.. చుట్టుముట్టిన గ్రామస్తులపై కాల్పులు, ఒకరు మృతి
అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
Weather Changes | ప్రపంచ దేశాల్లో దుర్భరమవుతున్న వాతావరణ పరిస్థితులు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

