హైదరాబాద్ : ఈ నెల 16, 17 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీలో కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపు నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు వెల్లడించారు. ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ క్యాంపును నిర్వహించనున్నారు. యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో పాటు విద్యార్థులకు కరోనా టీకా ఉచితంగా వేయనున్నారు. అయితే టీకా వేసుకునేందుకు వచ్చే ఉద్యోగులు, విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్‌కార్డుతో పాటు వర్సిటీ జారీ చేసిన ఐడీ కార్డును తీసుకురావాలని అధికారులు సూచించారు.