కరోనా బాధితులకు ఉచిత అన్నదానం
ఎమ్మెల్యే గణేష్ బిగాల | దివంగత బిగాల కృష్ణమూర్తి జ్ఞాపకార్థం కరోనా బాధితులు, వారి సహాయకుల కోసం నిర్వహిస్తున్న ఉచిత భోజన తయారీ కేంద్రాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో -ఆర్డినేటర్ మహేష్ బిగాల సందర్శించారు.

హైదరాబాద్ : దివంగత బిగాల కృష్ణమూర్తి జ్ఞాపకార్థం కరోనా బాధితులు, వారి సహాయకుల కోసం నిర్వహిస్తున్న ఉచిత భోజన తయారీ కేంద్రాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో -ఆర్డినేటర్ మహేష్ బిగాల సందర్శించారు. అనంతరం హమాల్ వాడి చౌరస్తాలో కరోనా బాధితులు, వారి సహాయకులకి భోజనం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ..కరోనా రెండో దశ విజృంభిస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కరోనా బాధితులు, వారి సహాయకులు, నిజామాబాద్ నగరంలో వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్న బాధితులు, వారి సహాయకులు భోజనం దొరకకుండా ఇబ్బంది పడకూడదని వారి కోసం మా తండ్రి జ్ఞాపకార్థం గత 35 రోజులుగా ఉచితంగా భోజనం వితరణ చేస్తున్నామని తెలిపారు.

అన్నదాన కార్యక్రమానికి దివంగత మా తండ్రిగారే స్ఫూర్తి అని పేర్కొన్నారు. అలాగే కరోనా వృద్ధి చెందకుండా కరోనా నివారణ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది. ప్రభుత్వ చర్యలకు మద్దతుగా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి వ్యక్తి గతంగా సహాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే గణేష్ బిగాల ముందుకు వచ్చారని తెలిపారు.
ఉచిత భోజన వితరణ కార్యక్రమంలో పాల్గొంటున్న కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్స్ ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
చిన్నారి గుండెకు అండగా ఎమ్మెల్యే మర్రి
ప్రజా సేవలో పోలీసులు అంకితం కావాలి
మెడికల్ హబ్‌గా మహబూబాబాద్ : మంత్రి సత్యవతి
వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలి
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : మంత్రి పువ్వాడ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | నేడు చలో కరీంనగర్.. అల్గునూరులో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం
Caste Census | కులగణనపై అనుమానాలెన్నో.. దేశవ్యాప్తంగా నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితి
Evening Court | ఈవెనింగ్ కోర్టులు వద్దు.. హైకోర్టు యాక్టింగ్ సీజేకి బార్ అసోసియేషన్ల సమాఖ్య వినతి
RTC Merger | అటకెక్కిన ఆర్టీసీ విలీనం.. మూడేండ్లు కావొస్తున్నా నెరవేరని హామీ!
IND vs NZ | ఫాలోఆన్ తప్పినా.. ఆలౌట్తో భారత్‌కు కష్టాలు!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

